లక్ష్యాలను చేరిన వర్థమాన్‌ బ్యాంక్‌

– వార్షిక సాధారణ సమావేశం ఏర్పాటు
హైదరాబాద్‌: వర్ధమాన్‌ (మహిళ) కో ఆపరేటివ్‌ అర్బన్‌ బ్యాంక్‌ లిమిటె డ్‌ 34వ వార్షిక జనరల్‌ బాడీ సమావేశం మంగళ వారం జరిగింది. నగరంలోని కుట్‌చి భవన్‌ లో జరిగిన ఈ సమావేశానికి ఆ బ్యాంక్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ (సిఇఒ) ఎడిఎన్‌వి ప్రసాద్‌ సభ్యులకు స్వాగతం పలికారు. ఛైర్మన్‌ రితేష్‌ కుమార్‌ డాగ, డైరెక్టర్లు నిర్మలా డాగ, రాజ్‌ కుమారి చోర్డియా, తుషార్‌ సవ్లా, మహేందర్‌ కుమార్‌ జైన్‌ గొలెచా, వాటాదా రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా 2022 -23 ఆర్థిక సంవత్సరానికిగాను ఆ బ్యాంక్‌ ప్రగతి విష యాలను నిర్మలా డాగ వివరించారు. బ్యాంక్‌ పెట్టుకున్న డిపాజిట్లు, రుణాల లక్ష్యాలను చేరుకున్నామన్నారు.
రూ.839 కోట్ల రికార్డ్‌ వ్యాపారాన్ని నమోదు చేశామన్నారు. నికర లాభాలు 45 శాతం పెరిగాయ న్నారు. స్థూల నిరర్థక ఆస్తులు రూ.12.58 కోట్ల నుంచి రూ.4.42 కోట్లకు తగ్గాయన్నారు. నికర ఎన్‌పిఎలు కూడా రూ.10.17 కోట్ల నుంచి రూ.1.67 కోట్లకు పరిమితమ య్యాయని తెలిపారు. తమ ఖాతాదారులు సైబర్‌ దాడులకు గురి కాకుండా అనేక చర్యలు తీసుకుంటున్నామని ఛైర్మన్‌ రితేష్‌ కుమార్‌ పేర్కొన్నారు.