– డిసెంబర్ 15న మళ్లీ కాసులవర్షం
ముంబయి: మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) మినీ వేలం డిసెంబర్ 15న జరుగనుంది. బెంగళూర్ వేదికగా జరుగున్న ఈ వేలంలో ఐదు ప్రాంఛైజీలు రూ.15 కోట్ల పర్సుతో మహిళా క్రికెటర్ల కోసం పోటీపడనున్నాయి. ఐపీఎల్ 2025 వేలం సౌదీ అరేబియాలోని జెడ్డా నగరంలో ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో ఇంగ్లాండ్ కెప్టెన్ హీథర్ నైట్, కివీస్ ఫాస్ట్ బౌలర్ లీ తహుహు, వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డాటిన్ సహా భారత క్రికెటర్లు స్నేహ రానా, పూనమ్ యాదవ్, వేద కృష్ణమూర్తిలు ప్రధాన ఆకర్షణగా నిలువనున్నారు. డబ్ల్యూపీఎల్ మూడో సీజన్ వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చిలో జరుగనుంది.