– సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీ దహనం
నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్
మాజీ సీఎం కేసీఆర్ పై ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం ధర్నా రాస్తారోకో నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలను దహనం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పది సంవత్సరాల్లో అభివృద్ధి పథంలో నడిపించిన మాజీ సీఎం కే చంద్రశేఖర రావు పై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సీఎం కాగానే రేవంత్ రెడ్డిలో అహం బాగా పెరిగిందని, ఇదంతా రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తున్నారని అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి వ్యాఖ్యలు మానుకోకుంటే ప్రజలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.