నవతెలంగాణ-పాల్వంచ
గత 13 రోజులుగా సమస్యలు పరిష్కారం చెయ్యాలని సమ్మె చేస్తున్న 2వ ఏఎన్‌ఎంలు ప్రభుత్వ వైఖరికి నిరసనగా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ రాస్తారోకోను ఉద్దేశించి ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి నరటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శులు కంచర్ల జమలయ్య, వేల్పుల మల్లికార్జున్, ఏఎన్‌ఎం యూనియన్ జిల్లా అధ్యక్షులు సజ్జు బేగం, కార్యదర్శి ప్రియాంక పాల్గొన్నారు.