ఆశా ల రాస్తారోకో…

– స్తంభించిన రాకపోకలు
నవతెలంగాణ – అశ్వారావుపేట: ఆశ వర్కర్లు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం నిరవధిక సమ్మెలో భాగంగా శుక్రవారం నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట మూడు రోడ్ల కూడలి లో  రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు అర్జున్ మాట్లాడుతూ ఆశ వర్కర్లను ప్రభుత్వం వెంటనే చర్చకు పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ యూనియన్ నాయకులు భారతి సమత తిరుపతమ్మ విష్ణు కుమారి చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.