ఆర్మూర్ పట్టణంలో రాస్తారోకో..

నవతెలంగాణ- ఆర్మూర్ 

బీజేవైఎం పట్టణ, మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా బుధవారం పట్టణంలోని  కెనాల్ బ్రిడ్జి మీద రాస్తారోకో నిర్వహించినారు. ఈ సందర్భంగా బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మందుల బాలకృష్ణ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియామకాలు ప్రధాన ఎజెండగా సాధించుకున్న తెలంగాణలో  నేటికి 9 సంవత్సరాలు గడిచిన ఇప్పటికి కూడా 2 లక్షల నోటిఫికేషన్లు ఇవ్వకపోవడం,3016 నిరుద్యోగ భృతి ఫీజు  రియంబర్స్మెంట్ అమలు చేయకపోవడం కెసిఆర్ నియంతృత పాలనకు వ్యతిరేకంగా రాస్తారోకో నిర్వహించడం వెనువెంటనే  3016 నిరుద్యోగ భృతి మరియు ఉద్యోగ నోటిఫికేషన్ ఫీజు రియంబర్స్మెంట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీజేవైఎం అసెంబ్లీ ముట్టడికి కూడా సిద్ధమని డిమాండ్ చేశారు , కార్యక్రమంలో బీజేవైఎం పట్టణ అధ్యక్షులు కలిగొట ప్రశాంత్ మండల అధ్యక్షులు నరేష్ చారి ప్రధాన కార్యదర్శిలు ఉదయ గౌడ్,  సతీష్ బబ్లూ, పసుపుల సాయికుమార్,  ఉపాధ్యక్షులు పండరి అక్షయ్, పెద్దోళ్ల, భరత్, ఖందేశ్, ప్రశాంత్, లక్కీ, రాము, తదితరులు పాల్గొన్నారు..