ధాన్యం కొనుగోలు చేయాలని రాస్తారోకో

నవతెలంగాణ-కట్టంగూరు
గత నెల రోజులగా మండలంలోని ఈదులూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆ గ్రామానికి చెందిన రైతులు శుక్రవారం మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కొద్దిసేపు రాస్తారాకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రానికి లారీలు పంపకుండా పిఎసిఎస్‌ చైర్మెన్‌ నూక సైదులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పలువురు రైతులు ఆరోపించారు. తరుగు పేరుతో క్వింటాలకు ఐదు కేజీల వరకు కోతలు చేస్తున్నారన్నారు. తక్షణమే కొనుగోలు ప్రారంభించి రైతులను ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు తవిడ బోయిన భవాని, దండంపెల్లి శ్రీను, మాడత వెంకట్‌ రెడ్డి ముక్కెర లింగయ్య లింగయ్య గుడుగుంట నగేష్‌, దేశవి రామకృష్ణ, తవిటి నాగార్జున, నలమాద నరసింహ, మల్లేష్‌ నిమ్మన గోటి నరసింహ, దండంపల్లి యాదయ్య, నార్ల పరుశురాములు నలమాద భద్రయ్య పాల్గొన్నారు.