ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని రాస్తారోకో

నవతెలంగాణ – వాంకిడి
మండల కేంద్రంలోని గోయగావ్‌ గ్రామం వద్ద బుధవారం కమాన గ్రామానికి చెందిన డ్రైవర్‌ కొండయ్య(ప్రశాంత్‌)రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో కమాన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సుమారు రెండు గంటల పాటు రాస్తారోకో నిర్వహించారు. సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ సాగర్‌ సంఘటన స్థలానికి చేరుకొని రాస్తారోకో చేస్తున్న కుటుంబ సభ్యులను, గ్రామస్తులను సముదాయించారు. మృతుడి కుటుంబానికి ఎక్స్‌గ్రేషియా చెల్లించే విధంగా చర్యలు చేపడతామని హామీ ఇవ్వడంతో రాస్తారోకో విరమించారు.