ప్రముఖ సినీ రచయిత చిన్నికృష్ణ ఇంట విషాదం నెలకొంది. ఆయన తల్లి లక్ష్మీ సుశీల (75) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారు జామున తుదిశ్వాస విడిచారు. ఆమె స్వగ్రామం తెనాలిలో అంత్యక్రియలు జరిగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చిన్నికృష్ణకు తన తల్లితో అనుబంధం ఎక్కువ. ఆమ్మ ప్రేమ గొప్పతనాన్ని తెలుపుతూ ఆయన ఎన్నో కవితలు రాశారు.