– ప్రభుత్వం ఏర్పడి పది మాసాలు
– చైర్మన్ నియామకంపై ఎదురుచూపులు
– జిల్లా నేతన్నలకు ప్రయోజనం
నవతెలంగాణ – సిరిసిల్ల
రాష్ట్రంలో చేనేత జౌలి శాఖ కార్పొరేషన్ నియామకం పది మాసాలు గడుస్తున్నా.. ఇంకా పూర్తి కాలేదు. దీంతో వస్త్రోత్పత్తి వర్గాల్లో నిరాశ నెలకొంది. రాజన్న సిరిసిల్ల జిల్లా మరమగ్గాల వస్త్ర ఉత్పత్తికి ప్రసిద్ధి. తెలంగాణ పవర్ లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ను నియామకం జరిపితే జిల్లా వస్త్రోత్పత్తి పరిశ్రమకు ప్రయోజనం చేకూరుతుంది.
సిరిసిల్ల చేనేత వస్త్రోత్పత్తికి ప్రసిద్ధి..
కాలానుగునంగా వస్తున్న మార్పులు చేనేత మరనేతగా మారిపోయారు. రాష్ట్రవ్యాప్తంగా చేనేత మరమగ్గాలను జియో ట్యాగింగ్ చేశారు. దానిలో చేనేత మగ్గాలు 17573 ఉండగా, మర మగ్గాలు 35588 ఉన్నాయి. జిల్లాకు వచ్చేసరికి చేనేత మగ్గాలు 174 ఉంటే, మరమగ్గాలు 25494 ఉన్నాయి. మరమగ్గాల వస్త్రోత్పత్తి రంగంలో రాష్ట్రంలో జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. జిల్లా మరమగాల వస్త్రోత్పత్తి ఆటుపోట్లను ఎదుర్కొంటుంది.
ప్రత్యేక వ్యవస్థ..
జిల్లాలో మరమగాల మ్యాక్స్ సంఘాలు, ఎస్ఎస్ఐ యూనిట్లు ఉన్నాయి. ప్రభుత్వం మరమగాల వస్త్రోత్పత్తి రంగానికి నూలు బ్యాంకు ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప్రభుత్వ ఆర్డర్లకు,సంఘాలకు, ఎస్ ఎస్ ఐ యూనిట్లకు నూలు రాయితీ అందించవచ్చు. జిల్లాలో నూలు బ్యాంకును ఏర్పాటు చేయడంతో పరిశ్రమలో చాలావరకు భారం తగ్గుతుంది. ప్రభుత్వం నుంచి ఆర్డర్లను తీసుకోవడం, ఉత్పత్తికిసంఘాలకు, ఎస్ ఎస్ ఐ యూనిట్లకు ఇవ్వడం జరుగుతుంది. సిరిసిల్లలో మరమగ్గాలు విస్తరించి ఉండటంతో ఇక్కడ ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసే అవకాశాలుఉన్నాయి. జిల్లాలో నేత కార్మికులకు సాయం చేసేందుకు కార్పొరేషన్ పనిచేస్తుంది. జిల్లాలో టెక్స్టైల్ పార్క్ పట్టణంలోని మరమగాల పరిశ్రమలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను విస్తృతం చేయడం కోసం జౌళి శాఖ కార్యాలయంలో 200 పైచిలుకు ఉద్యోగులు తాత్కాలిక ఒప్పంద ప్రాతిపదికన పనిచేస్తున్నారు. ఇందులో పనిచేస్తున్న కమ్యూనిటీ సోషల్ రెస్పాన్స్ పర్సన్స్ కు శాశ్వత ఉపాధి లభించనుంది.
ఆశావాహుల ఎదురుచూపులు..
జిల్లాలో మరమగ్గాల వస్త్రోత్పత్తి విస్తరించి ఉండడంతో ప్రభుత్వంలో కార్పొరేషన్ చైర్మన్ పదవి జిల్లా నేతన్నలకు దక్కే అవకాశం ఉంది. ప్రభుత్వం చైర్మన్ నియామక ఉత్తర్వుల పైనే జిల్లా ప్రజలు 10 మాసాలుగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే జిల్లాకు చెందిన వస్త్ర పరిశ్రమలోని నేతన్నలు రాజధానిలోని కాంగ్రెస్ నేతల దృష్టిలో పడేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. పురపాలక ఎన్నికలు పూర్తయ్యాక చైర్మన్ నియామకం తెరపైకి వచ్చే అవకాశం ఉన్నట్లు సమాచారం.