నవతెలంగాణ – బొమ్మలరామారం
మండలంలోని మర్యాల గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందిన 2015_2016 సంవత్సర పదో తరగతి విద్యార్థులు పాఠశాలలో జిరాక్స్ మిషన్ లేక విద్యార్థులు జిరాక్స్ సెంటర్ కు వెళ్లి ఇబ్బంది పడుతున్నారని,విషయం తెలుసుకున్న పూర్వ విద్యార్థులు శుక్రవారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు నిర్మల జ్యోతికి నూతన జిరాక్స్, ప్రింటర్ మిషన్ ను అందజేశారు.ఈ కార్యక్రమంలో పాములపర్తి నరేష్ చారి, చీర గణేష్ ఉచ్చింతల ప్రవీణ్ కుమార్, జూపల్లి అశోక్, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.