రాష్ట్రస్థాయి క్రీడల్లో రాణిస్తున్న యాదాద్రి జిల్లా వాసులు…

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి సీనియర్ కబడ్డీ పోటీల్లో యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు రాణిస్తున్నారు. వివరాలను పరిశీలిస్తే యాదాద్రి జిల్లాలోని వలిగొండ మండలం (యం) తుర్కపల్లి గ్రామానికి చెందిన యువకులు దుడ్డు అశోక్, ఎలిమినేటి మహేష్ రాష్ట్రస్థాయి క్రీడలో పాల్గొని, జిల్లాకు పేరు తీసుకు వస్తున్నారని కబడ్డీ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షులు మహేందర్ యాదవ్ తెలిపారు. రాష్ట్రస్థాయి క్రీడలకు ఎంపికైన విద్యార్థులకు యాదాద్రి భువనగిరి జిల్లా వాసులు అభినందనలు తెలిపారు.