యాదవ్ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలి..

నవతెలంగాణ-బొమ్మలరామారం : ఈనెల 22వ తేదీన బుధవారం రోజున తుర్కపల్లి మండలం లో జరిగే యాదవ ఆత్మీయ సమ్మేళనం విజయవంతం చేయాలని శ్రీకృష్ణ యాదవ సంఘం మండల అధ్యక్షులు కూకుట్ల ఈశ్వర్ యాదవ్ కోరారు.మండలంలోని తిమ్మాపురం, ప్యారావరం, చీకటి మామిడి, బొమ్మలరామారం,చౌదర్ పల్లి, గ్రామాల్లోని యాదవులతో శనివారం సమావేశం నిర్వహించారు.యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బడుగుల లింగయ్య యాదవ్ రానున్నట్లు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వీరారెడ్డిపల్లి మాజీ ఎంపిటిసి రాజయ్య యాదవ్, మల్కాపురం సర్పంచ్ మేకల బాలకృష్ణ యాదవ్, విద్యార్థి విభాగం అధ్యక్షులు ర్యాకల రమేష్ యాదవ్, తుర్కపల్లి మండల యాదవ సంఘం అధ్యక్షులు సీత రాజు యాదవ్, రాసాల మల్లేశం యాదవ్ ఆలేరు మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంటి శ్రీశైలం యాదవ్ పల్లెపాడు గ్రామ యాదవ సంఘం అధ్యక్షులు దాసరి గురువయ్య యాదవ్, మానుక రాజు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.