చారిత్రక పరిశోధకులు యాదవరావుకు ఘన సన్మానం

నవతెలంగాణ – రెంజల్
నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కందకుర్తి వాస్తవ్యులు యాదవరావు చారిత్రక పరిశోధకులుగా జాతీయస్థాయి అవార్డు నందు కోవడంతో ఆయనకు షాలువ కప్పి పూలమాలతో ఘనంగా సన్మానం జరిపారు. నీలా జిల్లా పరిషత్ పాఠశాలలో మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ జాతీయ చైర్మన్ రాధిక సెషన్, మనూ వైస్ ఛాన్స్లర్ సయ్యద్ ఐనుల్ హసన్, ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు రాఘవేందర్, ఉపాధ్యాయులు ఆనంద్, అబ్బయ్య, గులాం హైమద్, శ్రీనివాస్, తాహెర్ ,సురేష్ , ఇలా ఉపాధ్యాయురాలులు తదితరులు పాల్గొన్నారు.