– బిసి కమిషన్,చైర్మన్ నిరంజన్ కు వినతిపత్రాన్ని అందజేసిన
– అఖిల భారత యాదవ మహాసభ కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్
నవ తెలంగాణ మల్హర్ రావు/కాటారం.
యాదవులు గొర్రెలు,మేకలు జీవాలపై ఆధారపడి జీవిస్తూ ఉరిఉరుకు,చెట్టుచెట్టుకు తిరుగుతూ సమాచారం చేస్తూ జీవిస్తున్న యాదవులను సంచార జాతుల్లో చేర్చాలని అఖిల భారత యాదవ మహాసభ కాటారం డివిజన్ అధ్యక్షుడు ఆత్మకూరి స్వామి యాదవ్ శనివారం బిసి కమిషన్, చైర్మన్ నిరంజన్ కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు బిసి జనగణతో పాటు కుల గణన చేసి ఏ,బి,సి,డి లుగా రిజర్వేషన్ కల్పించాలన్నారు. తెలంగాణ రాష్ట్ర యాదవ కులానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, ప్రతి ఏటా రూ.1000 కోట్ల బడ్జెట్ కేటాయించాలని కోరారు.తెలంగాణ రాష్ట్ర యాదవ కులస్థులు ఎక్కువగా మేకల గొర్రెల పెంపకంపై ఆధారపడి జీవిస్తుంటారు,వాటి పెంపకం కొరకు రాష్ట్రమంతటా సంచరిస్తుంటారు కావున యాదవ కులాలను సంచార జాతుల జాభితాలో చేర్చాలన్నారు.తెలంగాణ రాష్ట్రంలో జనభాలో అధిక జనభా కల్గిన యాదవ కులం రాజకింగా,ఉద్యోగ రిత్యా చాల వెనుకబడి ఉన్నది కావునా యాదవ కులమునకు ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలన్నారు.తెలంగాణ రాష్ట్రానికి గొర్రెల, మేకల మార్కెట్ ద్వారా ప్రభుత్వానికి అధిక ఆదాయము ఉన్నందున యాదవ కుటుంబాలకు గొర్రెల మేకలు పెంపకానికి షేడ్ల నిర్మాణానికి 80శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు