సుభాష్ రావ్ దేశ్ పాండే సమర్పణలో ప్రదీప్ రెడ్డి, శివ నాయుడు, గోవా జ్యోతి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా ‘యజ్ఞ’. ఈ చిత్రంలో సుమన్ శెట్టి, జబర్దస్త్ అప్పారావు, చిట్టిబాబు, చెన్నకేశవనాయుడు, ఆవిష్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఆర్.ఆర్.మూవీ క్రియేషన్స్, రేణుక ఎల్లమ్మ ఫిలింస్ బ్యానర్స్ పై చిలుకోటి రఘురాం, చీలపల్లి విఠల్ గౌడ్ నిర్మిస్తున్నారు. హర్రర్ కామెడీ కథతో దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ ఈ సినిమాను రూపొందిస్తున్నారు. త్వరలో ఈ సినిమా పిఅర్‌కె ఫిలింస్ ద్వారా రిలీజ్‌కు రెడీ అవుతోంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ వేడుక ప్రసాద్ ల్యాబ్స్‌లో ఘనంగా జరిగింది. దర్శకుడు చిత్తజల్లు ప్రసాద్ మాట్లాడుతూ, ‘ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు పెద్ద యజ్ఞమే చేశాం. మొదట సినిమా ప్రారంభించినప్పుడు ఉన్న ప్రొడ్యూసర్ షూటింగ్ టైమ్‌కు వెళ్లిపోయాడు. ఆ తర్వాత నేను బాధపడుతుంటే నా స్నేహితుడు రఘురాం, విఠల్, సుభాష్ రావు నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారు. క్యూబ్‌లు, యూఎఫ్‌లు చిన్న సినిమాలకు భారంగా మారుతున్నాయి. సెన్సార్ వాళ్ల వల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇవన్నీ దాటుకుని మూవీని రిలీజ్‌కు తీసుకురాబోతున్నాం. సినిమా హిట్ అయ్యి మా ప్రొడ్యూసర్స్‌కు డబ్బులు తీసుకురావాలి. హర్రర్ కామెడీ మూవీగా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది’ అని తెలిపారు. ‘మా సినిమాకు ప్రతాని రామకృష్ణ గౌడ్, లయన్ సాయి వెంకట్ సపోర్ట్‌గా ఉన్నారు. మా డైరెక్టర్ పట్టుదలగా మూవీని కంప్లీట్ చేశారు. నేను, రఘురాం నిర్మాతలమే అయినా మమ్మల్ని నడిపించేది సుభాష్ రావు. ఆయనకు కృతజ్ఞతలు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం. అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అంశాలన్ని ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయి. మా సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం’ అని నిర్మాత విఠల్ గౌడ్ అన్నారు.