తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ చిత్రాన్ని ఏర్పాటు చెయ్యాలి: యాకూబ్ పాషా

నవతెలంగాణ – పాల్వంచ
రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందిస్తున్న తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్ చిత్రాన్ని ఏర్పాటు చెయ్యాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండి. యాకూబ్ పాషా గురువారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు. ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ లోని చార్మినార్ కు ఒక విశిష్టత ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నూతనంగా రూపొందిస్తున్న  రాష్ట్ర ప్రభుత్వ చిత్రాన్ని రూపొందించడంలో అధికార, ప్రతిపక్ష పార్టీల, ప్రజాసంఘాల అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రోపొందిచడం సమంజసం కాదని, రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్ర చిహ్నం రుపొందించడం పై పునరాలోచన చేసి తెలంగాణ రాష్ట్ర చిహ్నం నందు చార్మినార్ చిత్రాన్ని ఏర్పాటు చెయ్యాలని కోరుతూ.. ఈ మేరకు ప్రభుత్వానికి లేఖ రాసినట్టు తెలిపారు.