కాంగ్రెస్‌కు యాలాల మండలం కంచుకోట

– ఆత్మీయ సమ్మేళనంలో వ్యాపారవేత్త,
– కాంగ్రెస్‌ నాయకుడు పి రాజేందర్‌ రెడ్డి,
– మాజీ మండలాధ్యక్షులు ఏ.భీమప్ప
నవతెలంగాణ-యాలాల
మండలం కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉంటుందని యాలాల మాజీ సర్పంచ్‌ నారాయణరెడ్డి కుమారుడు, వ్యా పారవేత్త, కాంగ్రెస్‌ నాయకుడు పి. రాజేందర్‌ రెడ్డి అన్నా రు. ఆదివారం మండల కేంద్రా నికి సమీపంలో ఉన్న రైతు పొలంలో కాంగ్రెస్‌ ముఖ్యకార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నిం పారు. ఈ సందర్భంగా పి రాజేందర్‌ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ కార్యకర్తలు ఎప్పుడూ పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. రానున్న సాధారణ ఎన్నికల్లో తాండూరు గడ్డపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేయడం ఖాయమని జోష్యం చెప్పారు. మండలంలో కాంగ్రెస్‌కు ఓటు బ్యాంకు ఉందని, వారిని సద్వినియోగం చేసుకునే నాయకత్వం సరిగా లేద ని కార్యకర్తలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఇకనుండి పటిష్టమైన, బలమైన, నాయకత్వం ఉందని ఏ ఒక్క కార్య కర్తా ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. త్వరలో గ్రామ గ్రామానా పర్యటించి ఆత్మీయ పలకరింపు కార్యక్ర మం నిర్వహించనున్నామని చెప్పారు. టీపీసీసీ అధిష్టానం తాండూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పేరు ఎవరిని ప్రకటించిన అం దరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా కృషి చేయడానికి సిద్ధం గా ఉండాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ అధిష్టానం ఆదేశాల మేరకు పార్టీ గెలుపు కోసం సేవ చేస్తున్నామని మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమప్ప అన్నారు. కార్య క్రమంలో మండల కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షులు అయ్యగాల్ల భీమప్ప. సీనియర్‌ నాయకులు ముకుందాపూర్‌ సిరెళ్లి సా యన్న. అక్కంపల్లి మల్లప్ప, అనంతయ్య, నాగయ్య, మైను ద్దీన్‌, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు.