రూ.80 లక్షల లాభాల బాటలో యాలాల సొసైటీ

– మండల వ్యాప్తంగా 344
– మంది రైతులకు, రూ.2.24,
– కోట్ల స్వల్పకాలిక రుణమాఫీ,
– జిల్లాలోనే ఎక్కువ రుణమాఫీతో ఆదర్శంగా నిలిచిన యాలాల సొసైటీ
– చైర్మన్‌ గుర్రాల సురేందర్‌ రెడ్డి వెల్లడి
నవతెలంగాణ-యాలాల
ఏప్రిల్‌ నుండి సెప్టెంబర్‌ మాసం వరకు దాదాపు రూ.80 లక్షల లాభాల బాటలో యాలాల సొసైటీ ఆర్థికం గా ప్రగతిలో నిలిచి ముందుకు కొనసాగుతుందని ఆ సం ఘం చైర్మన్‌ గుర్రాల సురేందర్‌ రెడ్డి అన్నారు. శనివారం ఇన్‌చార్జి సీఈవో వేణు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సర్వసభ్య సమావేశాన్ని ఆ సంఘం చైర్మన్‌ జి. సు రేందర్‌ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. వారు మాట్లాడు తూ.. మండల వ్యాప్తంగా 344 మంది రైతులకు రూ. 2.24 కోట్ల స్వల్పకాలిక రుణాలమాఫీనీ ప్రభుత్వం చేసిం దన్నారు. ఇచ్చిన మాట ప్రకారం రూ.లక్ష రుణమాఫీ ఆచర ణలో చేసి చూపించిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కింద న్నారు. జిల్లాలో ఎక్కువ రుణమాఫీతో యాలాల సొసైటీ ఆదర్శంగా నిలిచిందని వెల్లడించారు. రూ.2.50 కోట్లతో దౌలాపూర్‌ సమీపంలో గోదాం, రైస్‌ మిల్లును నిర్మాణం పూర్తి చేసి వచ్చే సీజన్‌ వరకు అన్నదాతలకు అందుబాటు లోకి తీసుకురానున్నామన్నారు. రూ. 30 లక్షలతో నూతన సమావేశం మందిరం నిర్మాణం పూర్తి కావస్తుందన్నారు. ఇకనుండి యాసంగి, ఖరీఫ్‌ పంటల సాగు కోసం యూరి యా, డీఏపీ 20 20, రైతులకు సకాలంలో అందిస్తామ న్నారు. గతంలో తులం బంగారానికి రూ.30 వేలు అందిం చే వాళ్ళం, ఇప్పుడు తులం బంగారానికి రూ. 40 వేలు ఇస్తామన్నారు. అదికూడా బంగారంపై 80 పైసలు తక్కు వ వడ్డీతో అందిస్తున్నామన్నారు. తీసుకున్న దీర్గకాలిక రుణాలను రైతు సోదరులు వెంటనే తిరిగి చెల్లిస్తే సొసైటీ మరింత లాభాల బాటలో ఉంటుందని అందుకోసం సహ కరించాలన్నారు. రైతును రాజును చేయాలని సంకల్పం తోనే అనేక రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి సీఎం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారన్నారు. 2023-24 సంబంధించిన అంచనా బడ్జెట్‌ రూ.17 కోట్ల 15 లక్షలు కేటాయించినట్టు ఆయన తెలిపారు. అందులో స్వల్పకాలిక అప్పులకు రూ. 5 కోట్లు, దీర్ఘకాలిక అప్పులకు రూ. 5 కో ట్లు, బంగారు రుణాలకు రూ.6 కోట్లు, ఎరువుల వ్యాపారం చేయడానికి రూ. 65 లక్షలు, సంఘం నిర్వహణ ఖర్చుల కోసం రూ. 50 లక్షలు సంఘ సభ్యులతో తీర్మానం చేశామ న్నారు. అసైన్మెంట్‌ వ్యవసాయ ఆధారిత భూములకు పంట రుణాలను ఇవ్వడం ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. రైతుల డిమాండ్‌ మేరకు పాత పద్ధతిన పంట రుణాలను అందించాలని సంఘం ద్వారా తీర్మానం చేసి నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తెలిపారు. యాలాల సొసైటీ మాజీ చైర్మన్‌ సిద్రాల శ్రీనివాస్‌, సొసైటీ డైరెక్టర్లు వెంకట య్య, కే సంగారెడ్డి, అశోక్‌ రెడ్డి, చెన్నయ్య, ఎల్లమ్మ, శ్రీని వాస్‌ రెడ్డి, బెన్నూర్‌ ఎంపీటీసీ సభ్యులు లక్ష్మప్ప, మండల బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లారెడ్డి, యాదవ రెడ్డి, శరణుభూపాల్‌, సొసైటీ సిబ్బంది, వివిధ గ్రామాల రైతులున్నారు.