యల్ల రాములు సేవలు చిరస్మరణీయం

నవతెలంగాణ – ఆర్మూర్ 
కీర్తిశేషులు మాజీ ఎంపీపీ యల్ల రాములు పట్టణ అభివృద్ధి తో పాటు మారుమూల గ్రామాల అభివృద్ధిలో నిర్విరామ కృషి చేసినారని బీ ఆర్ ఎస్ నియోజకవర్గ నాయకులు ఆశన్న గారి రాజేశ్వర్ రెడ్డి అన్నారు.  ఆయన జయంతి సందర్భంగా శుక్రవారం పట్టణంలోని ఆలూరు రోడ్ వద్ద గల ఆయన విగ్రహాన్ని పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ అధ్యక్షునిగా పనిచేస్తున్న సమయంలో పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, ప్రజా నాయకునిగా, పేద,, బడుగు బలహీన వర్గాల కోసం సేవ చేసినారని ,,అందరితో కలుపుగోలుగా ఉండే యల్ల రాములు హయాంలో మారుమూల గ్రామాలు సైతం అభివృద్ధి చెందినయని అన్నారు.. ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్,, గడ్డం మల్లారెడ్డి,, వరి కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.