పట్టు వదలని విక్రమార్కుడు యనగందుల వెంకటనారాయణ

నవతెలంగాణ – నూతనకల్
గత 24 సంవత్సరాల నుండి టీచర్ ఉద్యోగం కోసం పోరాడుతూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని వాటిని అధిగమిస్తూ తన కుటుంబాన్ని పోషించుకుంటూ ప్రైవేటు ఉద్యోగిగా పని చేస్తూ పట్టుదలని విక్రమార్కుడిలా చదివి చివరకు టీజీటీ ఉద్యోగాన్ని తన సొంతం చేసుకున్నాడు మండల చిల్పకుంట్ల గ్రామానికి చెందిన యనగందుల వెంకటనారాయణ. ఒకవైపు తన భార్యా పిల్లలను తల్లిదండ్రులను పోషించుకుంటూ మరొకవైపు కష్టపడి చదువుతూ ముందుకు వెళుతున్న తరుణంలో కరోనా రావడంతో పాఠశాలలు నడవకపోవడంతో జీతం లేక కుటుంబాన్ని పోషించుకోవడం కోసం కొట్టు కొట్టు తిరుగుతూ కిరాణా సామానులు టీవీఎస్ ఎక్సెల్ బండిపై అమ్మతూ మొక్కవోని శ్రమతో శ్రమిస్తూ నేటి యువతతో పోటీపడుతూ సుమారు 48 సంవత్సరాల వయసులో ఉద్యోగాన్ని సాధించి యువతకు ఆదర్శంగా నిలిచాడు.చదువాలనే  పట్టుదల ఉండాలే గానీ దానికి వయసు,పేదరికం అడ్డే కాదని నిరూపించి చూపించాడు.తాను సాధించిన ఈ విజయానికి కుటుంబ సభ్యులు, బంధువులు,తన మిత్రులు, చిన్ననాటి స్నేహితులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.