సిఎ ఫైనల్ పరీక్షల్లో యానంపల్లి విద్యార్థి ప్రతిభ..

నవతెలంగాణ -డిచ్ పల్లి
డిచ్ పల్లి మండలంలోని యానంపల్లి గ్రామానికి చెందిన దాసరి వంశీ సీఎ ఫైనల్ పరీక్షలో 472 మార్కులు సాధించి సీఎగా ఎంపికైనట్లు
డిచ్ పల్లి జడ్పీటీసీ సభ్యురాలు దాసరి ఇందిరా లక్ష్మీనర్సయ్య శుక్రవారం తెలిపారు. యానంపల్లి గ్రామానికి చెందిన దాసరి వంశీ ఆల్ ఓవర్ ఇండియాలో లక్ష మంది విద్యార్థులు పరీక్షలు వ్రాయగా ఆల్ ఇండియా స్థాయిలో మంచి ర్యాంకు సాధించి సీఎగా సెలక్ట్ అయ్యాడన్నారు. సీఎగా సెలక్ట్ అయిన దాసరి వంశీని జడ్పీటీసీ ఇందిరా లక్ష్మీనర్సయ్యతో పాటు తల్లిదండ్రులు దాసరి రాము, సులోచనలు వంశీని ప్రత్యేకంగా అభినందించారు.మున్ముందు మరింతగా రానించలని వారన్నారు.