
నవతెలంగాణ – భువనగిరి
పేదల పెన్నిధి, పోరాటాల వారధి యండి. జహంగీర్ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ పిలుపునిచ్చారు. శనివారం భువనగిరి మండల పరిధిలోని హన్మాపురం మదిర గ్రామం కుర్మగూడెంలో జహంగీర్ ను గెలిపించాలని సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా నర్సింహ పాల్గొని మాట్లాడుతూ.. పది ఏండ్ల బీజేపీ పాలల్లో కాంగ్రెస్ చేపట్టిన ప్రైవేటీకరణ విధానాలను దుండుడుకుగా అమలు చేస్తూ అంబానీ, అదాని వంటి కుబేరులను పెంచి పోషిస్తు మరింత ధనవంతులుగా తయారుచేసి పేదలను మరింత పేదలుగా తయారు చేసిందని విమర్శించారు. ప్రజలు రోజు వాడుకునే సరుకుల ధరలు విపరీతంగా పెంచి ప్రజల బతుకులతో ఈ పదేళ్ల నుండి చెలగాటమాడారని ఆవేదన వెలిబుచ్చారు. చదువుకున్న యువతీ యువకులకు ఏడాదికి రెండు కోట్ల కొలువులు ఇస్తామని ప్రగల్బాలు పలికి ఒక్కరికి ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల ఉసురు పోసుకుందని అన్నారు. ఉన్న కాస్త ఉద్యోగాలు ప్రభుత్వ రంగం ఉంటే ప్రభుత్వ రంగాన్ని మొత్తం ప్రైవేటుపరం చేసి కాస్తో కూస్తూ ఉపయోగపడుతున్న రిజర్వేషన్లు కూడా లేకుండా చేస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. పదిఎండ్ల బీజేపీ పాలనలో మహిళలపైనా లైంగిక దాడులు, దళితులపైన కుల దురంకార హత్యలు, అభ్యుదయ వాదుల మీద దాడులు పెద్ద ఎత్తున కొనసాగించిందని కొనసాగిస్తుందని అన్నారు. దేశానికి వెన్నెముక అయిన రైతులును నట్టేట ముంచడానికి వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టినందుకు నల్ల చట్టాలు తీసుకొస్తే రైతాంగం తిరుగుబాటు చేసి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పారని ఇలాంటి బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందుల పాలౌవుతారని అందుకే బీజేపీని చిత్తుగా ఓడించాలని, ఈ నియోజకవర్గంలో సమస్యలు పరిష్కారం కావాలంటే కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ను ఓడించి ప్రజల పక్షాన గత 35 సంవత్సరాలుగా పోరాటాలు నిర్వహిస్తున్న జహంగీర్ గారి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేసి గెలిపించాలని నర్సింహ్మ కోరినారు. ఇంకా ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నర్సింహ, మండల కార్యదర్శి దయ్యాల నర్సింహ, గ్రామ శాఖ కార్యదర్శి మోటె ఎల్లయ్య, మాజీ ఎంపీటీసీ దయ్యాల లక్ష్మి, సీపీఐ(ఎం) గ్రామ శాఖ నాయకులు తోటకూర గణేష్, దయ్యాల మల్లేష్, తోటకూరి రాము, దయ్యాల ఉమా, ముద్దం అముర, తోటకూరి కేతమ్మ, ముద్ధం బాలమ్మ, జాన లక్ష్మమ్మ పాల్గొన్నారు.