– విదర్బ, మధ్యప్రదేశ్ రంజీ సెమీస్
నాగ్‌పూర్: యశ్ రాథోడ్ (97 నాటౌట్, 165 బంతుల్లో 12 ఫోర్లు), అక్షరు వాడ్కర్ (77, 139 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలతో విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు వైఫల్యంతో విదర్భ కష్టాల్లో కూరుకుంది. ధ్రువ్ శోరె (40), ఆమన్ (59) రాణించారు. కరుణ్ నాయర్ (38) స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. లోయర్ ఆర్డర్‌లో యశ్ రాథోడ్ అజేయ అర్థ సెంచరీకి అక్షరు, ఆదిత్య (14 నాటౌట్) జతకలిశారు. మూడో రోజు ఆట ముగిసే సమయానికి విదర్భ రెండో ఇన్నింగ్స్‌లో 90 ఓవర్లలో 343/6 పరుగులు చేసింది. ప్రస్తుతం 261 పరుగుల ముందంజలో కొనసాగుతున్న విదర్భ నేడు ఉదయం సెషన్లో వీలైనన్ని పరుగులు జత చేయటంపై ఫోకస్ పెట్టనుంది. మధ్యప్రదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 252 పరుగులు చేసింది.