యశోబుద్ధ ఫౌండేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా క్యాలెండర్ ఆవిష్కరణ..

Inauguration of Yasobuddha Foundation Society of India Calendar..నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో మండల అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో సోమవారం యశోబుద్ధ  ఫౌండేషన్ బుద్దిస్ట్  సొసైటీ ఆఫ్ ఇండియా – (తెలంగాణ) క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు సుంకరి విజయ్ మాట్లాడుతూ భారత దేశ ప్రజలు తథాగదా బుద్ధుడి, మహనీయులు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిరావు ఫూలే  ఆలోచన విధానంలో, వారి అడుగు జడల్లో జీవన శైలి కొనసాగించాలని యశోబుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ ఫౌండేషన్ వారి యొక్క  సంకల్పం చాలా గొప్పదన్నారు. గొప్పవారు ఆశించిన విధంగా మహనీయుల ఆశయాలకు, ఆలోచనలకు  అనుగుణంగా నడుచుకుంటూ ముందుకు కొనసాగుతామని అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తెలిపారు.కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కమ్మర్ పల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలేపు నర్సయ్య, యశో బుద్ధ సొసైటీ ఆఫ్ ఇండియా తెలంగాణ వ్యవస్థాపక సభ్యులు రవీందర్, రత్నం, శంకర్, అంబేద్కర్ యువజన సంఘం మండల కన్వీనర్ నిమ్మ ప్రసాద్, లెక్చరర్ సాయన్న, క్రియాశీల కార్యదర్శి గుర్రం నరేష్, కార్యదర్శి నరేందర్, సన్నీ, మాజీ ఉప సర్పంచ్ గంగారం, శైలేందర్, వినయ్, రాకేష్, ఆంజనేయులు, శ్రీధర్, అశోక్, వివిధ గ్రామాల అంబేద్కర్ యూత్ సంఘ సభ్యులు పాల్గొన్నారు.