బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు నిజామాబాద్ నగర కమిటి అధ్యక్షులుగా నిజామాబాద్ నగరానికి చెందిన యాతల అనిల్ కుమార్ ను బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు నిజామాబాద్ నగర కమిటి అధ్యక్షులుగా రాష్ట్ర అధ్యక్షులు దండి వెంకట్ నియమించారని బహుజన లెఫ్ట్ ట్రేడ్ యూనియన్స్ బి ఎల్ టి యు నిజామాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మేకల రాజేందర్ బుధవారం తెలిపారు. నగరంలో బహుజన కార్మికులను సంఘటిత శక్తిగా మార్చడం ద్వారా బహుజన శ్రామిక వర్గ ప్రజాస్వామ్య ప్రత్యామ్నాయం లక్ష్యంగా పని చేస్తారని మేకల రాజేందర్ ఆశాభావం వ్యక్తం చేశారు.