ఏచూరి దేహం సైతం దేశానికే అంకితం: సీపీఐ(ఎం) చిరంజీవి

Yechury's body is also dedicated to the country: CPI(M) Chiranjeeviనవతెలంగాణ – అశ్వారావుపేట

బాల్యం నుండే ప్రజా సేవకు అంకితం అయి చివరికి తన భౌతిక దేహాన్ని సైతం భవిష్యత్తు వైద్యులు ప్రయోజనార్ధం వైద్యం కళాశాలకు అంకితం చేసిన అభినవ మార్క్సిస్ట్  మహోపాధ్యాయుడు సీతారాం ఏచూరి అని సీపీఐ(ఎం) మండల కన్వీనర్ చిరంజీవి కొనియాడారు. గురువారం మృతి చెందిన పార్టీ జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి కి స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం లో శుక్రవారం మండల కమిటీ ఆద్వర్యంలో మండల కమిటీ సభ్యులు ముల్లగిరి గంగరాజు అధ్యక్షతన సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్ర తాపం వ్యక్తం చేసారు.అనంతరం ఆయన పార్టీకి చేసిన సేవలను,ప్రజా ప్రతి నిధిగా ప్రజలకు అందించిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో మడిపల్లి పటానికి నివాళులు అర్పిస్తూ మౌనం పాటించి సంవెంకటేశ్వరరావు,ఏసు,మురళి తదితరులు పాల్గొన్నారు.