సీపీఐ(ఎం) అఖిలభారత కార్యదర్శి సీతారామ్ ఏచూరి మరణం కమ్యూనిస్టులకు తీరని లోటు అని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ర్యకల శ్రీశైలం అన్నారు. శుక్రవారం బొమ్మలరామారం మండలంలో సీపీఐ(ఎం) మండల కమిటీ ఆధ్వర్యంలో సీపీఐ(ఎం) అఖిలభారత కార్యదర్శి ఉత్తమ పార్లమెంటేరియన్ కామ్రేడ్ సీతారామ్ ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వారి మరణం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని పేద ప్రజల హక్కుల కోసం అనేక ఉద్యమాలను రూపొందించిన మహా మేధావి అని కొనియాడారు. యాదాద్రి భువనగిరి పట్టణానికి ఎంతో అనుబంధం ఉందని అనేక సభలు ఎన్నికలు సందర్భంగా వచ్చినప్పుడు తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర కలిగిన, ప్రజా ఉద్యమాలు నిర్వహించాలని ప్రోత్సహించే వారిని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు దేశెట్టి సత్యనారాయణ, కెంసారం బిక్షపతి, ముక్యర్ల పున్నమ్మ, ముక్యర్ల బాల నరసింహ, భారతం బోదాసు, నరసమ్మ, లక్ష్మి, వెంకటేష్, రమేష్ ,తదితరులు పాల్గొన్నారు.