ఏచూరి మరణం దేశ రాజకీయాలకు తీరని లోటు

– సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి సమ్మక్క
– కాటాపూర్లో ఘనంగా సంతాప సభ 
నవతెలంగాణ -తాడ్వాయి 
సీతారాం ఏచూరి మృతి దేశ రాజకీయాలకు తీరనిలోటు అని సీఐటీయూ ములుగు జిల్లా సహాయ కార్యదర్శి కురేందుల సమ్మక్క అన్నారు. శుక్రవారం ఆయనకు సంతాప సభ నిర్వహించి, ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీతారాం ఏచూరి పోరాటాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని, ఆయన మరణం దేశ రాజకీయాలకు తీరని లోటని సమ్మక్క అన్నారు. ఆయన ఆశయాల కొరకు పని చేద్దాం అని నినాదాలు చేశారు. విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టి దాదాపు నాలుగు దశాబ్దాలకు పైగా జాతీయ రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఆయన లేని లోటు పూడ్చలేదని పేర్కొన్నారు. ఏచూరి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారని ఆర్థికవేత్తగా సామాజిక కార్యకర్తగా ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. అట్టడుగు వర్గాల ప్రజలతో సీతారాం ఏచూరి కి మంచి అనుబంధం ఉందని తెలిపారు. ప్రజా సమస్యలు ఇతర అంశాలపై గళం విప్పుతూ ఎగువసభలు సీతారాం ఏచూరి గుర్తింపు పొందాలని అన్నారు. 2004లో యూపీఏ సంకీర్ణ ప్రభుత్వ నిర్మాణంలోనూ ముఖ్యభూమికి పోషించారని తెలిపారు. అంతేకాకుండా సీతారాం ఏచూరి మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు, సంతాపం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు చిట్టినేని శ్రీనివాస్ అంగన్వాడి జిల్లా సెక్టార్ నాయకులు అంగన్వాడి టీచర్లు నిర్మల శ్రీకళ సరిత వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.