నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్ వాయి మండలంలోని యెల్లరెడ్డి పల్లి సర్పంచ్ గుర్రపు నరేష్ డీసీసీ డెలిగేట్ సుధాకర్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్స మోహన్,ఎన్ ఎస్ యుఐ రూరల్ కన్వీనర్ ఆశిష్ అద్వర్యంలో బుదవారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ఆకర్షితులై చేరినట్లు చెప్పారు. రాబోవు రోజుల్లో పార్టీ అబివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తానని సర్పంచ్ గుర్రపు నరేష్ వివరించారు.ఈ కార్యక్రమం లో వెంకొల్ల రాజన్న, షారూఖ్, సుబ్బారావు ,ముజహిద్,గంగారాం, అనిల్, సురేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.