– వైట్‌హౌస్ వేదికగా ట్రంప్- బైడెన్ భేటీ
వాషింగ్టన్: రిపబ్లికన్, డెమోక్రట్ నేతల మధ్య హౌరాహౌరీగా సాగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో.. డొనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించారు. ఈ క్రమంలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ , నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధికార మార్పిడి సజావుగా సాగేందుకు సహకరించుకోవాలని ఇరువురు నిర్ణయించుకున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత.. గెలిచిన వారితో అధ్యక్షుడు భేటీ కావడం ఆనవాయితీగా కొనసాగుతోంది. అయితే, 2020లో ఎన్నికల్లో ఓడిపోయిన డొనాల్డ్ ట్రంప్.. విజయం సాధించిన జో బైడెన్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. అంతేకాకుండా బైడెన్ బాధ్యతలు చేపట్టే కార్యక్రమానికీ హాజరుకాలేదు. అయినప్పటికీ.. బైడెన్ మునుపటి సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ట్రంప్‌నకు ఆహ్వానం పంపారు. ఈ మేరకు వైట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు పాల్గొనడం విశేషం.