‘మీ సినిమా ఓపెనింగ్‌కు వచ్చిన నేను మళ్లీ మీ చిత్ర టీజర్‌ని విడుదల చేయడం హ్యపీగా ఉంది. ‘యేవమ్’ చాలా మంచి టైటిల్. మీ ప్రమోషన్ కంటెంట్ చూస్తుంటే చిత్రం కూడా కొత్తగా ఉంటుందని అనిపిస్తుంది. టీజర్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది’ అని దర్శకుడు హరీశ్ శంకర్ అన్నారు. ‘యేవమ్’ టీజర్‌ను లాంచ్ చేసి సినిమా సక్సెస్ అవ్వాలని మనస్పూర్తిగా కోరుకున్నారు.
చాందిని చైదరి, వశిష్ట సింహా, భరత్‌రాజ్,ఆషు రెడ్డి ముఖ్య తారలుగా రూపొందుతున్న చిత్రం ‘యేవమ్’. ఈ చిత్ర టీజర్‌ను శుక్రవారం డైరెక్టర్ హరీష్‌శంకర్ విడుదల చేశారు.
ప్రకాష్ దంతులూరి . దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నవదీప్, పవన్ గోపరాజు నిర్మాతలు.
ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ,’కంటెంట్‌ను నమ్మి చేసిన సినిమాలకు తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడూ ఉంటుంది. డిఫరెంట్ అండ్ న్యూ కంటెంట్‌తో రాబోతున్న మా సినిమాపై పూర్తి విశ్వాసంతో ఉన్నాం. మా టీజర్‌ను డైరెక్టర్ హరీష్ శంకర్ విడుదల చేయడం ఆనందంగా ఉంది. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన చాందిని చౌదరి, ఆషూ రెడ్డి, వశిష్ట సింహా, భరత్‌రాజ్ పాత్రలకు సంబంధించిన లుక్స్ విడుదల చేశాం. అన్ని పాత్రల లుక్స్‌కు మంచి స్పందన వచ్చింది. మహిళా సాధికారికతను చాటి చెప్పే నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ : ఎస్‌వీ విశ్వేశ్వర్, సంగీతం: కీర్తన శేషు, నీలేష్ మందలపు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత : రాజు పెన్మెత్స.