లార్డ్స్ హైస్కూల్లో ఘనంగా యోగా డే

నవతెలంగాణ – మీర్ పేట్
అంతర్జాతీయ యోగా దినోత్సవ సందర్భంగా జిల్లేలగూడ లార్డ్స్ హై స్కూల్ ఘనంగా అంతర్జాతీయ యోగ డేను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లార్డ్స్ విద్యాసంస్థల చైర్మన్ సిద్ధాల బీరప్ప, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా చేయడం వల్ల చాలా రకాల దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయే విద్యార్థిని విద్యార్థులకు తెలిపారు. ఎవరైతే యోగాని ప్రతి రోజు సాధన చేస్తారో అటువంటి వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారని, శరీరానికి మెదడుకి మధ్య బలమైన బంధం ఏర్పడుతుందని అన్నారు. ముఖ్యంగా చేతికి చూపుకి మధ్య సమన్వయం మెరుగుపరచడంలో యోగ సహాయపడుతుందని చెప్పారు. కీళ్ల ఆరోగ్యాన్ని పెంపొందించి, వృద్యాప్యంలో వచ్చే కీళ్ల నొప్పుల సమస్యలను దరిచేరనివ్వదని పేర్కొన్నారు. స్కూల్ ఆవరణలో విద్యార్థినీ విద్యార్థులతో యోగాసనాలు వేశారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్స్ సిద్ధార్థ శ్రీలత, అనురాధ, డి సతీష్ కుమార్ ప్రిన్సిపల్ మీనారావు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు.