నవతెలంగాణ -నవీపేట్: మండల కేంద్రంలోని సుభాష్ నగర్ కాలనీలో అభ్యుదయ గ్రామీణ వికాస సంఘం, ఆర్య సమాజ్ మరియు భారత్ స్వాభిమాన్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు, పిల్లలతో యోగా ఆసనాలు చేయించి యోగ యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో గంజి సాయన్న, వసంత్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.