రాంనగర్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో యోగా డే..

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్

జూన్ 21 యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం భువనగిరి  పట్టణంలో రామ్ నగర్ వాకర్స్ అసోసియేషన్ తరపున యోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ (బి ఆర్ ఎస్ నాయకులు) తాడెం రాజశేఖర్  మాట్లాడుతూ యోగాసనాల ద్వారా మనిషి ఆరోగ్యాన్ని , మానసిక ఆనందాన్ని పొందుతారని 10 సంవత్సరాల నుంచి రాంనగర్ వాకర్స్ అసోసియేషన్ నుంచి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్తూ భువనగిరి పట్టణ ప్రజలందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు.  ఈ కార్యక్రమంలో మాజీ ప్రెసిడెంట్ (సిపిఎం నాయకులు)  గునుగుంట్ల శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు చింతకింది కృష్ణమూర్తి, సభ్యులు చామల వెంకటనారాయణ రెడ్డి, మల్లికార్జున చారి, పడాల భాస్కర్ , యాదగిరి, ఉపేందర్, శ్రీనివాస్ రెడ్డి, వెంకట్ రెడ్డి, శంకర్ రెడ్డి, రాజు, శ్రీనివాస్, రవీందర్ , యాదగిరి, ఇస్తారి,  నరేష్, సురేష్ లు పాల్గొన్నారు.