శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును ప్రోత్సహించే లక్ష్యంతో యోగా శిబిరాన్ని తాడిచెర్ల ఓసిపిలో ఏఎమ్మార్ ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డి, వేంకట రమణ,హార్టఫుల్నేస్,టీచర్, హైదరాబాద్ వాలంటీర్ల సమక్షంలో మంగళవారం జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ శిక్షణ శిబిరాలు మూడురోజులపాటు ఉచితంగా నిర్వహించునట్లుగా తెలిపారు. నేటి వేగవంతమైన ప్రపంచంలో ధ్యానం యొక్క ప్రాముఖ్యతను అలాగే ఇది శారీరక ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మానసిక, భావోద్వేగ శ్రేయస్సును కూడా మెరుగుపరిచే సమగ్ర అభ్యాసమని వివరించారు.దీన్ని ప్రోత్సహించడానికి ఏఎమ్మార్ సంస్ధ చొరవ తీసుకోవడం సంతోషకరమన్నారు. ఆరోగ్యకరమైన ఈ ధ్యాన శిబిరాన్ని అనుభవజ్ఞులైన బోధకులు నిర్వహిస్తారని,వారు వివిధ యోగా భంగిమలు, శ్వాస పద్ధతులు,ధ్యాన అభ్యాసాల ద్వారా మార్గనిర్దేశం చేస్తారని ప్రాజెక్ట్ హెడ్ చెప్పారు.ఈ కార్యక్రమంలో సీనియర్ వైస్ ప్రెసిడెంట్. శ్రీధర్, సీనియర్ జనరల్ మేనేజర్ కెఎస్ఎన్ మూర్తి, మేనేజర్ జి శ్రీనివాస్,కె సురేష్ బాబు, ఎస్ఓ.హెచ్ ఆర్ రవి కుమార్ పాల్గొన్నారు.