యోగ శిక్షణ గురువుకు సన్మానం 

Yoga training is a tribute to the teacherనవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ పట్టణంలోని ధర్మ యోగ శిక్షణ గురువు మున్సిపల్ వైస్ చైర్మన్ ఐలేని అనిత ను ఆదివారం గురు పౌర్ణమి సందర్భంగా సన్మానించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత మాట్లాడుతూ ప్రతిరోజు యోగ చేయడం ద్వారా అనేక రోగ సమస్యలు రాకుండా చేసుకోవచ్చన్నారు.  నిజజీవితంలో యోగాను అలవాటు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చిత్తారి పద్మ, వాళ్ళ సుప్రజ, బోజు రమాదేవి, సుచిత్ర, శ్రీదేవి, కన్యాకుమారి, శ్రీదేవి తదితరులు  పాల్గొన్నారు.