ఘనంగా యోగేశ్వరాలయ జాతర ఉత్సవాలు

నవతెలంగాణ – తొగుట
చుట్టూ ఆకుపచ్చని చెట్లు, పక్షుల కిలకిలరా వాలు, గుట్టల మధ్య వెలసిన భక్తుల పాలిట కొంగు బంగారంగా నిలిచిన మండలంలోని వెంకట్రావు పేట వాగ్గడ్డ వద్ద గల వెంకటేశ్వరాలయంతో పాటు యోగేశ్వరాలయం వద్ద శుక్రవారం ఘనంగా జాతర ఉత్సవాలు కొనసాగాయి. ఏటా మాఘ అమావా స్య సందర్భంగా ఇక్కడ జాతర పెద్దఎత్తున నిర్వ హించడం ఆనవాయితీగా వస్తుంది. వెంకర్రావు పేటలో కొలువైన వేణుగోపాల స్వామిని డప్పు చప్పల్లతో షావ ద్వారా జాతర వద్దకు గ్రామస్థులు తీసుకు వస్తారు. అనంతరం స్వామి వారిని గుట్టల మధ్య ఉన్న ఆలయంలో ఏర్పాటు చేస్తారు. ఆయా గ్రామాల భక్తులు గుట్టల లోపల ఉన్న వెంకటేశ్వర  స్వామిని దర్శించుకొని దీపారాధన చేస్తారు. జాత ర సందర్భంగా గ్రామం నుండి రంగు రంగులతో అలంకరించిన ఎడ్ల బండ్లను, ట్రాక్టర్లను ఆలయం తో పాటు ప్రక్కనే ఉన్న యోగేశ్వరాలయం, రేణుకా ఎల్లమ్మ, సౌడాలమ్మ చుట్టూరా ప్రదక్షణ చేయి స్తారు. ఇక్కడ ఉన్న యోగేశ్వరాలయం వాస్తురీత్యా ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆలయానికి మూడు వైపులా గుట్టలు ఉండగా ఈశాన్యంలో ఆలయానికి దారి ఉంటుంది. అలాగే ఆలయానికి ఈశాన్యంలో కూడవెల్లి వాగు ప్రవహిం చడం విశేషంగా చెప్పుకుంటారు. కాకతీయుల హాయాంలో యోగేశ్వరాలయం ఏర్పాటు చేసినట్లు చరిత్ర చెబుతుందని అన్నారు. జాతరకు మండల ప్రజలతో పాటు సుదూర ప్రాంతాలకు చెందిన భక్తులు హాజరవుతారు. ఈ జాతరలో  సిఐ ఎస్ కె.లతీఫ్, గ్రామ ప్రత్యేక అధికారి, తహసీల్దార్ శ్రీకాంత్, ఏఎస్ఐ రాంరెడ్డి,పంచాయతీ కార్యదర్శి నర్సింగరావు, వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.