– కబ్జాలకు గురైన భూములను ఇప్పిస్తానన్నావ్
– ముందుగా డిగ్రీ కళాశాల భూముల కబ్జా గురించి మాట్లాడు
– ఎమ్మెల్యే పై విరుచుకుపడ్డ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు
నవతెలంగాణ – కామారెడ్డి
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను మర్చి పతున్నామని ఎవరి బొమ్మలైన కబ్జాల గురి అయితే వారి భూములను తిరిగి ఇప్పిస్తానని, ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి గెలిచిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి ఆ విషయాలను మరిచిపోయి మాట్లాడుతున్నాడని, ముందుగా నీకు దమ్ముంటే డిగ్రీ కళాశాల భూముల కబ్జా గురించి మాట్లాడాలని గురువారం కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కైలా శ్రీనివాసరావు ఎమ్మెల్యే తీరుపై విరుచుకుపడ్డారు. కామారెడ్డి ఎమ్మెల్యేకు పత్రికల్లో పేయిడ్ ఆర్టికల్ వేయించుకోవడం, టీవీ ఛానల్ కు ఇంటర్వూలు ఇవ్వడం తప్ప ఆయనకు కామరెడ్డి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడం చేతకాదు అన్నారు. ముమ్మాటికి నువ్వు కామారెడ్డి ప్రజల నమ్మకాన్ని వమ్ము చేశావు అని, ప్రజా ఆగ్రహానికి నీ రూపురేఖలు మారకుండా చూసుకో వలసిన అవసరం వచ్చిందన్నారు. నీవు ఎన్నికల్లో చేసిన వాగ్దానాలు ఒకటి కూడా అమలు చేయలేదని, ఇంటి వద్ద న్యాయవాద బృందాన్ని ఏర్పాటు చేసి కబ్జాలకు గురైన భూములను ఇప్పిస్తానని ప్రగల్భాలు పలికావు మరి ఎంతమందికి న్యాయం చేశావని, దమ్ముంటే ముందు డిగ్రీ కాలేజ్ భూముల్లో జరిగిన కబ్జాల గురించి మాట్లాడాలన్నారు. గ్రామ గ్రామాన వాడ వాడ ఫిర్యాదుల పెట్టెను పెట్టావు ఎంతమంది ఫిర్యాదు చేశారు, ఎంతమందికి న్యాయం చేసావు, అభివృద్ధి జరుగుతుంటే సహించలేక ప్రోటోకాల్ జగడం మొదలుపెట్టాన నువ్వు ప్రస్తుతం
రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి సహకరించడం లేదంటూ అబద్ధపు మాటలు మాట్లాడుతున్నావు అన్నారు. పార్టీ మారే ఆలోచనతో కాంగ్రెస్ అధిష్టానానికి సంప్రదింపులు చేసిన మాట వాస్తవం కాదా నీ ముఖ్య అనుచరులతో రహస్య సమావేశం నిర్వహించలేదా, అభివృద్ధి చేసే చేతకాని మాటలతో అభివృద్ధి చేస్తా అంటే కుదరదు నిధులతో అభివృద్ధి చేయాలన్నారు. త్రాగునీటి కోసం అమృత్ నిధులు నీవు తీసుకువచ్చినవి కావు గత ప్రభుత్వ హయాంలో మంజూరు అయ్యి పెండింగ్ లో ఉంటే షబ్బీర్ అలీ అధికారులను సమన్వయం చేసుకొని లోటుపాట్లను సరిదిద్దుకుంటూ రాష్ట్ర వాటా మున్సిపల్ వాటా నిధులు విడుదల చేయించి తాగు నీటి సమస్య తీర్చాలని పట్టుదలతో పనులు పూర్తి చేస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నానన్నారు. మున్సిపల్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రివ్యూ నిర్వహించి జిల్లా ఇంఛార్జి మంత్రితో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో, సెక్రటేరియట్ లో మెగా ప్రాజెక్టు వారిని, అధికారులను సమన్వయం చేసి ప్రాజెక్టు పనులను ప్రారంభించారన్నారు. గత ప్రభుత్వంలో పెండింగ్ లో వున్న సీఎంఆర్ఎఫ్ చెక్కులను ముఖ్యమంత్రితో మాట్లాడి నిధులు విడుదల చేయిస్తే చెక్కులను నేనే పంపిణీ చేస్తానని ముఖ్యమంత్రి కార్యాలయంలో సిగ్గు లేకుండా ధర్నా చేసి చెక్కులు పంపిణీ చేశావు, ఇప్పుడు పత్రికల్లో నేనే మంజూరు చేయించాను అని బిల్డప్పులు ఇస్తున్నావు ఇది ఎంతవరకు నిజమన్నారు. మా నాయకుడు ఎవరు చెక్కులు పంపిణీ చేస్తే ఏముంది నియోజకవర్గ ప్రజలు లబ్ధి పొందాలి వారి సమస్యలు పరిష్కారం కావాలని కోరుకునే విశాల హృదయం గలనాయకుడన్నారు.
అకాల వర్షాలకు కామారెడ్డి పట్టణం అతలాకుతలమైతే కనీసం వారిని పలకరించిన పాపాన పోలేదని, భిక్కనూరు రామేశ్వరం పల్లిలో డబల్ బెడ్ రూమ్ లు నీట మునిగి ప్రజలు నిరాశ్రయులైతే వారిని హుటాహుటిన ఆశ్రయం కల్పించి వారిని ఆర్థికంగా ఆదుకున్నా మా నాయకుడు షబ్బీర్ అలీ అన్నారు. నువ్వు బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం గడుస్తుంది ఇప్పటివరకు ఎన్ని కల్లాలు కట్టావు, ఎన్ని మోడల్ స్కూల్ కట్టావు, ఎన్ని మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కట్టావు, క్రీడాకారుల కోసం ఎన్ని స్టేడియాలు కట్టావు, నీ ఉపాధి శిక్షణ కేంద్రం ఎక్కడ ఉందన్నారు. రైతు సేవ కేంద్రాలు ఎక్కడ, కె.పి రాజారెడ్డి ఫౌండేషన్ నిధులతో అభివృద్ధి చేస్తా అన్నావ్, దేశ విదేశాలలో ఉన్న దాతలతో నిధులు సమకూర్చి నువ్వు అభివృద్ధి పడ్డావా, నువ్వు చేసిన అభివృద్ధి వల్ల నియోజకవర్గమైతే నీవల్ల అభివృద్ధి కాలేదన్నారు. నువ్వు చేసిన అభివృద్ధి చెప్పుకుంటూ సభలు ఏర్పాటు చేయు ర్యాలీలు నిర్వహించూ , గత సంవత్సరం నుండి కేంద్ర నిధులు అయితే తేలేదు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకుందన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదని ర్యాలీలు తీసి ఉన్న పరువు పోగొట్టుకుంటున్నావు అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షు పండ్ల రాజు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు గోనె శ్రీనివాస్, కారంగుల అశోక్ రెడ్డి, ఐరేని సందీప్, తేజపు ప్రసాద్, బ్రహ్మానందరెడ్డి, రాజా గౌడ్, లక్కపతిని గంగాధర్, శ్యామ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.