నీవు నాకు రక్ష ,నేను నీకు రక్ష, మనిద్దరం దేశానికి రక్ష..

You protect me, I protect you, we both protect the country..– శారదా  విద్యాలయం ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్
– శారదా విద్యాలయంలో ముందస్తు రాఖీ పండుగ ఉత్సవాలు 
నవతెలంగాణ – పరకాల 
నీవు నాకు రక్ష, నేను నీకు రక్ష, మనమిద్దరం దేశానికి రక్ష  అని శారద  విద్యాలయం ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్ అన్నారు. శనివారం హనుమకొండ జిల్లా పరకాల మండలంలోని శారద విద్యాలయం లో  ముందస్తు రాఖీ పండుగ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శారద విద్యాలయం ప్రిన్సిపాల్ మార్క సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ మన భారతీయ సంస్కృతులను, సంప్రదాయాలను, కాపాడుకోవాలని స్త్రీలను గౌరవించాలన్నారు. సమాజంలో అన్నా చెల్లెల అనుబంధం చాలా గొప్పదని కొనియాడారు.విద్యార్థిని, విద్యార్థులకు రాఖీ పండుగ విశిష్టతను తెలియజేశారు.అనంతరం బాలికలు స్వయంగా రాఖీలు తయారుచేసి అన్నయ్యలకు కట్టారు. ఈ  కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థినీ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.