ఎమ్మెల్యేను విమర్శించే స్థాయి నీకు లేదు

నవతెలంగాణ – తిరుమలగిరి
మున్సిపాలిటీ చైర్మన్ పోతరాజు రజిని నాలుగు సంవత్సరాల పాటు పదవిలో ఉండి ఒక్క రోజు కూడా  దళితులను  పట్టించుకోలేని మీకు ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి లేదని కాంగ్రెస్ పార్టీ జిల్లా సీనియర్ నాయకులు వంగాల దానియేలు అన్నారు. దళిత బంధు పైన విచారణ జరిపించాలని అంటున్న చైర్మన్ రజిని విచారణ జరిపితే ఎవరు దొంగలో బయటపడతారని దానికి మేము కూడా విచారణ కోరుతామని అది తప్పకుండా జరిపించాల్సిందేనని మేము డిమాండ్ చేస్తున్నామన్నారు. దళిత బంధు పేరుతో దళితులను మోసం చేసింది చైర్మన్ రజిని కాదా ఈ విషయం తిరుమలగిరి మున్సిపాలిటీలోని ప్రజలందరికీ తెలుసునన్నారు.సూర్యాపేట రోడ్డులో ఇండ్ల నిర్మాణాలకు అక్రమంగా అనుమతులు ఇస్తున్నారని గగ్గోలు పెట్టిన చైర్మన్ రజిని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  వద్దకు వెళ్ళి ఆయనతో చేతులు కలిపిoది ఎందుకు అని ప్రశ్నించారు. తాను దలిత బందులో చేసిన మోసాలను మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్  కుమార్ బయటపెట్టి రజిని దలితబందులో చేసిన మోసాలను అవినీతిపరురాలిగా ముద్ర వేస్తారని భయంతోనే ఆయన చెంత చేరారని అన్నారు. గాదరి కిషోర్ కుమార్ ని విమర్శించి మళ్లీ ఆయన చెంతకు చేరిoది మీరు కాదా అన్నారు. స్థాయి మరిచి ఎమ్మెల్యే మందుల సామేలు ని  విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. దొంగతనం చేసిన దొంగే దొంగ అన్నట్లు ఉందన్నారు. రజిని మళ్లీ కౌన్సిలర్ గా గెలువలేని  స్థాయి అన్నారు. ఎమ్మెల్యే మందుల సామేలు ప్రజల మనిషి ఆయనను విమర్శించడం తగదన్నారు.