– రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
నేర్చుకునే ఆసక్తిని జీవితకాలం కలిగి ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందర రాజన్ సూచించారు. మంగళవారం హైదరాబాద్‌లోని రాజ్ భవన్‌లో వంద మంది పేద విద్యార్థినులకు అక్షయ విద్య ఫౌండేషన్ పక్షాన ల్యాప్ టాప్‌లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ ఒకరు సాధికారత పొందితే అది మూడు తరాల ఆలోచనలను ప్రభావితం చేస్తుందని తెలిపారు. పేద విద్యార్థినులను ప్రోత్సహిస్తున్న డొనేట్ ఎ డివైస్ కార్యక్రమం ఉన్నత ఆశయంతో ముందుకెళ్తుందనీ, దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అక్షయ విద్య ఫౌండేషన్ వ్యవస్థాపకులు ఎస్.జనార్థన్, అకడమిక్ అడ్వైజర్, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.