భిన్న కాన్సెప్ట్‌తో తెెలుసు కదా..

You know with a different concept..పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలే సిద్దు జొన్నలగడ్డ హీరోగా తమ ప్రొడక్షన్‌ నెంబర్‌ 30ని అనౌన్స్‌ చేసింది. ‘తెలుసు కదా’ అనే టైటిల్‌తో, సోల్‌ఫుల్‌ లవ్‌ స్టొరీగా రూపొందనున్న ఈ చిత్రంతో స్టైలిస్ట్‌, కాస్ట్యూమ్‌ డిజైనర్‌ నీరజ కోన దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. బుధవారం హైదరాబాద్‌లో కోర్‌ టీమ్‌, పలువురు అతిథుల సమక్షంలో ఈ చిత్రం గ్రాండ్‌గా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన హీరో నాని ముహూర్తం షాట్‌కి క్లాప్‌ ఇవ్వగా, హీరోలు నితిన్‌, ఆది పినిశెట్టి స్క్రిప్ట్‌ని మేకర్స్‌కి అందజేశారు. దర్శకుడు బాబీ కెమెరా స్విచాన్‌ చేయగా, తొలి షాట్‌కు హరీష్‌ శంకర్‌ గౌరవ దర్శకత్వం వహించారు. భారీ బడ్జెట్‌తో టిజి విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ చిత్రానికి సంగీతం తమన్‌ అందిస్తున్నారు.