నవతెలంగాణ – ఆర్మూర్
ఒక సంవత్సరం12 నెలలు65 రోజులు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పదవి పై ఇరు వర్గాల పోరు..ప్రజల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది.ఈ ఆసక్తితో పాటు అభివృద్ధి కుంట పడుతుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కారు స్టీరింగ్ తిప్పిన హస్తం. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి పాలు కావడం గత కొన్ని ఏళ్ల నుండి కౌన్సిలర్ల మధ్య విభేదాలు చిలికి చిలికి గాలి వానలా మారి అవిశ్వాస తీర్మానానికి దారితీసింది గత రెండు సంవత్సరాల క్రితమే అవిశ్వాసం పెట్టేందుకు ప్రయత్నించగా అప్పటి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సముదాయించి నెట్టుకొచ్చారు.. గత సంవత్సరం డిసెంబర్ నెల నుండి జరుగుతున్న పరిణామాలు రోజుకో మలుపు తిరుగుతున్నవి. కాంగ్రెస్ నియోజకవర్గ నాయకులు పొద్దుటూరు వినయ్ రెడ్డి చైర్ పర్సన్ వర్గీయులు కలవడం, ఎమ్మెల్యే బిజెపి ఓటు వేయని కారణంగా అవిశ్వాసం వీగిపోయినట్లు ఈనెల మూడున ప్రభుత్వ ప్రిన్సిపాల్ సెక్రెటరీ కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేయడంతో ఈనెల 5వ తేదీన చైర్ పర్సన్ గా తిరిగి బాధ్యతలు స్వీకరించడం జరిగింది.
హైకోర్టును ఆశ్రయించిన ప్రత్యర్థి వర్గం: సంవత్సరం డిసెంబర్ 12న అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెడుతూ కలెక్టర్ నోటీసులు ఇవ్వడం, జనవరి 4న మున్సిపల్ కార్యాలయంలో అవిశ్వాస తీర్మానం సమావేశం ఏర్పాటు చేయడం, ఈ అవిశ్వాస సమావేశానికి 15 రోజుల ముందుగానే ఆర్డిఓ కౌన్సిలర్లకు నోటీసులు జారీ చేయడం, డిసెంబర్ 29న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఎక్స్ అఫీషియో సభ్యునిగా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అయితే అంతకుముందే కౌన్సిలర్లకు నోటీసులు ఇవ్వడంతో ఎమ్మెల్యేకు ఓటు హక్కు లేదనే ప్రచారం జరిగింది. మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ ,మామిడిపల్లి కలుపుకొని 36 మంది కౌన్సిలర్లలో రెండు బై మూడు అంటే 24 మంది కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే అవిశ్వాస తీర్మానం కు హాజరు కావడం చకచకా జరిగినవి.. కాగా 24 మంది కౌన్సిలర్లు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేసి నారు. ఎమ్మెల్యే ఎక్స్ అఫీషియో మెంబర్గా ఓటు వేయకపోవడంతో తీర్మానం వీగిపోయినట్లు ప్రకటించాలని చైర్పర్సన్ హైకోర్టును ఆశ్రయించగా పిటిషన్ను న్యాయమూర్తి జనవరి 11న కొట్టి వేసినారు. ఎమ్మెల్యే ఓటు వేయని కారణంగా అవిశ్వాసం వీగిపోయినట్లు ఈనెల 3న ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ కలెక్టర్కు ఉత్తర్వులు జారీ చేయగా, తిరిగి ఈ ఉత్తర్వుల ఆధారంగా చైర్పర్సన్ గా ఐదవ తేదీ పండిత్ వినీత మళ్లీ బాధ్యతలు స్వీకరించారు. 7 మంది కౌన్సిలర్ల తో36 మంది కౌన్సిలర్లలో రెండు బై మూడు అనగా 24 మందిని కోరంగా గుర్తించి అవిశ్వాస తీర్మాన సమావేశం నిర్వహించాలి .ఎక్స్ అఫీషియల్ గా ఉన్న ఎమ్మెల్యే ఓటును లెక్కలోకి తీసుకున్నట్లయితే 37 అవుతాయి. ఇందులో రెండు బై మూడు అంటే 25 మందిని కోరం సభ్యులుగా తీసుకొని సమావేశం నిర్వహించాలి. అవిశ్వాస తీర్మానం సమావేశంలో కోరం సభ్యులు 25 మందిలో 17 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేస్తే అవిశ్వాస తీర్మానం నెగ్గినట్లు అవుతుంది .మున్సిపల్ లో 24 మంది కౌన్సిలర్లు అనుకూలంగా ఓటు వేయడం ..అవిశ్వాస తీర్మానం నెగ్గినట్టేనని జనవరి 11న నాటి తీర్పులో స్పష్టంగా తెలిపినప్పటికీ, ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వేగిపోయిందంటూ ఉత్తర్వులు జారీ చేయడం ఏమిటని ప్రత్యర్థి వర్గం కౌన్సిలర్లు అంటున్నారు. దీంతో ప్రత్యర్థి వర్గం సైతం హైకోర్టును ఆశ్రయించగా ఈనెల 19 లోపు నూతన చైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయాలని అప్పటివరకు వైస్ చైర్మన్ చైర్పర్సన్ బాధ్యతలు ఇవ్వాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినట్టు అసమ్మతి కౌన్సిలర్లు శనివారం తెలిపారు. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఒక సంవత్సరం పదవి కోసం రాజకీయ విభేదాలతో అభివృద్ధి కుంట పడుతుందని అంటున్నారు.