‘తండేల్‌’ మ్యాజిక్‌ని మీరూ చూస్తారు

'Tandel' The magic You will see– నాగచైతన్య
‘నాకు ఎప్పటి నుంచో రియల్‌ లైఫ్‌ స్టోరీస్‌ ఆధారంగా సినిమాలు చేయాలని ఉండేది. పైగా ఇది మన తెలుగోళ్ళ కథ. ఈ కథ నాకెంతో స్ఫూర్తిని ఇచ్చింది. రూటెడ్‌గా ఉండే కథలు చేయడానికి బాగా ఇష్టపడతాను. ఆ ఇష్టంతోనే చాలా కష్టమైనప్పటికీ ‘తండేల్‌’ చేశాను’ అని హీరో నాగ చైతన్య చెప్పారు.
నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్‌’. చందూ మొండేటి దర్శకుడు. అల్లు అరవింద్‌ సమర్పణలో గీతాఆర్ట్స్‌ బ్యానర్‌పై బన్నీవాసు నిర్మించారు. ఈ చిత్రం ఈనెల 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో నాగచైతన్య బుధవారం మీడియాతో పలు విశేషాలను షేర్‌ చేసుకున్నారు.
నా కెరీర్‌లో భారీ బడ్జెట్‌ సినిమా
నా కెరీర్‌లో ఇది బిగ్గెస్ట్‌ ప్రొడక్షన్‌, హై బడ్జెట్‌ మూవీ. అన్ని రకాలుగా బిగ్‌ స్పాన్‌ ఉంది. ఇప్పటికే సినిమా చూశాం. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సెకండ్‌ హాఫ్‌ అయితే యునానిమస్‌గా చాలా బాగా చెప్పారు. నాకు కూడా ఎమోషనల్‌ హై ఇచ్చింది. చివరి ముఫ్ఫై నిమిషాలు వెరీ శాటిస్ఫాక్షన్‌. క్లైమాక్స్‌ గ్రేట్‌ ఎమోషనల్‌ హై ఇస్తుంది.
ఆ ఛాన్స్‌ కనిపించింది..
ఈ కథలో రియల్‌ లైఫ్‌ క్యారెక్టర్‌ దొరికింది. యాక్టర్‌గా నెక్స్ట్‌ స్టెప్‌కి వెళ్ళే అవకాశం కనిపించింది. దాదాపు 8 నెలలు స్క్రిప్ట్‌, నా ట్రాన్స్‌ఫర్మేషన్‌ మీదే ఉన్నాను. శ్రీకాకుళం యాస కోసం శిక్షణ తీసుకున్నాను. నేను చేసిన రాజు పాత్ర ఓ ఫైటర్‌. జైల్లో ఉనప్పుడు బాధని ఓర్చుకొని తన వారికోసం ఎలా పోరాటం చేశాడు?, ఎలా బయటికి వచ్చాడనేది చాలా గొప్పగా ఉంటుంది. తన ప్రేమకథే తనకి బలాన్ని ఇస్తుంది. నటుడిగా నాకు బాగా సంతృప్తినిచ్చిన సినిమా. ‘తండేల్‌’ మ్యాజిక్‌ని మీరూ చూస్తారు (నవ్వుతూ).
నాకు డబుల్‌ ధమకా..
డైరెక్టర్‌ చందుతో నాకు ఇది మూడో సినిమా. నన్ను కొత్తగా ప్రజెంట్‌ చేయడానికి ప్రయత్నించాడు. ఇది అవుట్‌ అండ్‌ అవుట్‌ లవ్‌ స్ట్టోరీ. లవ్‌ స్ట్టోరీ వెనుక మిగతా లేయర్స్‌ ఆద్యంతం ఆసక్తికరంగా ఉంటాయి. సాయి పల్లవి ఫెంటాస్టిక్‌ యాక్టర్‌. క్యారెక్టర్‌ని డీప్‌గా అర్థం చేసుకుంటుంది. దేవిశ్రీ ఇచ్చిన పాటలన్నీ సూపర్‌ హిట్‌ అయ్యాయి. ఈ కథ గీతా ఆర్ట్స్‌లో ఉండటం, అరవింద్‌, బన్నీవాసుతో మళ్ళీ కలిసి పనిచేయడాన్ని డబుల్‌ ధమాకాగా ఫీలవుతున్నాను.