‘నువ్వే కావాలి’..

'I want you'..మహబూబ్‌ దిల్‌ సే, శ్రీ సత్య కలిసి ప్రైవేట్‌ ఆల్బమ్‌ కోసం చేసిన యూత్‌ ఫుల్‌ సాంగ్‌ ‘నువ్వే కావాలి’ లాంచ్‌ ఘనంగా జరిగింది. ఈ పాటకి సురేష్‌ బనిశెట్టి లిరిక్స్‌ అందించగా, భార్గవ్‌ రవడ డిఓపి, ఎడిటింగ్‌, డైరెక్షన్‌ అన్ని తానే అయ్యి చిత్రీకరించారు. ఈ పాటకి మనీష్‌ కుమార్‌ మ్యూజిక్‌ అందించి పాట పాడగా, వైషు మాయ ఫిమేల్‌ వాయిస్‌ కి ఆయనతో జతకట్టారు. యూరోప్‌ లోని బార్సిలోన, మెక్సికో, పారిస్‌ వంటి అద్భుతమైన లొకేషన్స్‌ లో అందంగా చిత్రీకరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సోహెల్‌, నోయల్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌, రోల్‌ రైడా, గౌతమ్‌ కష్ణ, ప్రియాంక, సిరి హనుమంత్‌, గీతు రాయల్‌, క్రియేటివ్‌ హెడ్‌ క్రాఫ్ట్లీ చందు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని డైస్‌ ఆర్ట్‌ ఫిలిమ్స్‌ నిర్వహించింది. ఈ సందర్భంగా శ్రీ సత్య మాట్లాడుతూ,’ కచ్చితంగా ఈ సాంగ్‌ అందరికీ నచ్చుతుంది. మెహబూబ్‌ తో కలిసి సాంగ్‌ చేయడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ సాంగ్‌ కి నన్ను తీసుకున్నందుకు భార్గవ్‌ కి ధన్యవాదాలు. ప్రేక్షకులందరూ ఈ సాంగ్‌ ని సపోర్ట్‌ చేసి, పెద్ద సక్సెస్‌ చేయాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు. మహబూబ్‌ మాట్లాడుతూ, ‘ఈ సాంగ్‌ చూసిన ప్రతి ఒక్కరు బాగుందని ప్రశంసిస్తున్నారు. ప్రేక్షకులు కూడా ఈ పాటని ఆదరించి, పెద్ద సక్సెస్‌ చేయాలని ఆశిస్తున్నాను’అని చెప్పారు