హీరో ఉపేంద్ర ‘యు అండ్ ఐ ది మూవీ’తో అలరించడానికి సిద్ధంగా ఉన్నారు. లహరి ఫిల్మ్స్ జి మనోహరన్, వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మించారు. నవీన్ మనోహరన్ సహ నిర్మాత. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఈ చిత్రాన్ని తెలుగులో గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఈనెల 20న విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. డైరెక్టర్ బుచ్చిబాబు సాన, నిర్మాత ఎస్‌కేఎన్ అతిధులుగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్‌గా జరిగింది.
హీరో ఉపేంద్ర మాట్లాడుతూ, ‘తెలుగు ఇండిస్టీకి కతజ్ఞతలు. ఇండియానే కాదు.. ప్రపంచాన్నే షేక్ చేస్తుంది టాలీవుడ్. 1000 కోట్లు, 2000 కోట్లు సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ కొడుతున్నారు. నిర్మాత కె.పి శ్రీకాంత్‌కి ఈ సినిమా ఐడియా చెప్పాను. ఆయన లహరి లాంటి గొప్ప సంస్థని తీసుకొచ్చారు. ఇది రెగ్యులర్ ఫిల్మ్‌లాగా ఉండదు. ఒక కొత్త సినిమాని ఎక్స్‌పీరియన్స్ చేస్తారు. ఇది ఒక ఇమేజినరీ వరల్డ్‌లా ఉంటుంది. మ్యూజిక్ డైరెక్టర్ అజినీస్, ఆర్ట్ డైరెక్టర్ శివకుమార్, కెమెరామెన్ వేణు, ప్రజ్వల్, ఫైట్ మాస్టర్స్ రవివర్మ, థ్రిల్లర్ మంజు ఇలా అందరూ వచ్చి నా విజన్‌కి హెల్ప్ చేశారు. రేష్మ అద్భుతంగా పెర్ఫార్మ్ చేసింది. రాంబాబు అన్ని సాంగ్స్ బ్రహ్మాండంగా రాశారు. పార్థసారథి ఈ సినిమాని ఒక తెలుగు సినిమాలాగే ప్రజెంట్ చేశారు. నాకు చిరంజీవి ఫ్యామిలీతో 30 ఏళ్లుగా అనుబంధం ఉంది. ఆయనతో ఒక సినిమా చేయాలని వన్ ఇయర్ ట్రావెలయ్యాను. అల్లు అరవింద్ ఈ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. అది మాకు చాలా స్పెషల్. సినిమా ఓపెనింగ్ నుంచే షాక్ అవుతారు’ అని తెలిపారు.