
నవతెలంగాణ-రామగిరి
చిన్న వయస్సు.. పెద్ద మనసు.. రామగిరి మండల కాంగ్రెస్ బిసి సెల్ అధ్యక్షుడు, బండారి సదానందం కుమారుడు, బండారి శివ బుధవారం తన పుట్టినరోజు సందర్భంగా బేగంపేట గ్రామానికి ఎల్ఈడి బల్బులు పంపిణీ చేశాడు. సేవ చేయడానికి వయస్సుతో సంబంధం లేకుండా మనస్సు పెద్దది చేసుకొని చిన్న వయసు నుండే మానవీయ కోణంలో సామాజిక సేవ చేయడం పట్ల బండారి శివను గ్రామస్తులు తన మిత్రులు అభినందించారు. అలాగే పలువురు వ్యక్తులు శివను స్ఫూర్తిగా తీసుకొని యువత సేవా భావంతో ముందుకెళ్లాలని సూచించారు.