నవతెలంగాణ-మల్హర్‌రావు
ఇంట్లో నీళ్లకోసం పంపు వేస్తున్న క్రమంలో విద్యుత్ ప్రవాహం జరిగి చెలిమెల్ల వెంకట్ రెడ్డి అనే యువరైతు మృతి చెందిన ఘటన శుక్రవారం రాత్రి మండలంలోని కొయ్యురు గ్రామంలో చేటుసుకుంది.
వివరాల్లోకి వెళితే, తన ఇంట్లోని విధ్యుత్ మోటార్ కీ సంబందించిన స్టాటర్ లోని విద్యుత్ తీగలు బయటకి వచ్చి ఉన్నాయి, అది గమనించకుంట దానిని తెరిచే ప్రయత్నం చేయగా విద్యుత్ ఘాతం జరిగి వ్యక్తి మరణించడం జరిగింది. మృతుడికి భార్య, ఇద్దరు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు