– మాస్టర్ ప్లాన్ నుంచి ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ ఎత్తివేయాలని డిమాండ్
– కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టిన యువరైతు
– 3 వ రోజు కొనసాగింపు
– ఆరు గ్రామాల రైతుల సంఘీభావం
– కలసి కదం తొక్కనున్న రైతాంగం
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ప్రకటించిన భూముల్లో రైతులు ఎప్పటినుండో పంటలు పండించుకుంటున్న రైతుల భూముల్లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ లు ఏర్పాటు చేయడంతో 8 గ్రామాల రైతులు గత ఏడాది క్రితం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టిన విషయం విధితమే. కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం ఆ డ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రైతు పయ్యావుల రాములు తమ భూములు ఇండస్ట్రియల్ జోన్ లో భూములు పోతాయని ఆవేదనతో ఆత్మహత్య చేసుకున్న ఘటనతో రైతు ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. ధర్నాలు రాస్తారోకోలు నిర్వహించడమే కాకుండా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని రైతులు నిర్వహించారు.
రైతులు పంటలు సాగు చేసుకుంటున్న భూముల్లో ఇండస్ట్రియల్ జోన్ గ్రీన్ జోన్ ఏర్పాటు చేయడం ఏమిటని పలువురు మేధావులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు, మాస్టర్ ప్లాన్ ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ను కలిసిన రైతుల కు మాస్టర్ ప్లాన్ నుంచి రైతులకు సంబంధించిన భూములలో గ్రీన్ జోన్ ఇండస్ట్రియల్ జోన్ ఎత్తివేస్తామని ప్రకటించారు. దీంతో రైతులు ఉద్యమాన్ని విరమించారు. అప్పటికే ఎన్నికల రావడంతో ప్రతిపక్ష పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నాయకులు రైతులకు మద్దతుగా నిలిచి తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాస్టర్ ప్లాన్ ఎత్తివేస్తామని రైతులకు హామీ ఇచ్చారు.
ఎన్నికల సమయంలో బిఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి అన్ని పార్టీలు స్పందించి వారికి ఓట్లు రావాలని ఉద్దేశంతో రైతుల కు అండగా నిలిచాయి. గత సంక్రాంతి పండుగ నాడు రైతులు కామారెడ్డి ప్రధాన వీధులలో ముగ్గులు వేసి కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి నిరసన వ్యక్తం చేశారు. మొన్నటి ఎన్నికల్లో కామారెడ్డి నుండి బిజెపి నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసిన కాటిపల్లి వెంకటరమణారెడ్డి గెలుపొందారు. మాస్టర్ ప్లాన్ ఉద్యమం సమయంలో రైతులకు అండగా నిలబడి ఉద్యమం లో పాల్గొన్న వెంకటరమణారెడ్డికి 8 గ్రామాల రైతులు అండగా నిలిచి ఎన్నికల్లో గెలుపుకు కృషి చేశారు. వెంకటరమణ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఏడాది అవుతున్న మాస్టర్ ప్లాన్ విషయం మాట్లాడకపోవడం కనీసం అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఊసేతకపోవడం తో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న మాస్టర్ ప్లాన్ రద్దు గురించి ప్రకటన చేయక పోవడంతో ఎనిమిది గ్రామాల రైతులు ఆందోళన చెందుతున్నారు.
సదాశివ్ నగర్ మండలం వడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన యువరైతు శ్రీకాంత్ రెడ్డి సంక్రాంతి పండుగ సందర్భంగా ఎమ్మెల్యేలకు అధికారులకు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని తెలియజేస్తూ అమరననిరాహార దీక్షకు కూర్చున్నారు.ఈ దీక్ష బుధవారం నాటికి మూడవ రోజు చేరుకుంది. ఆదివారం రాత్రి 10 గంటలకు శ్రీకాంత్ రెడ్డి తన అమర్నాథ్ నిరాహార దీక్షను ప్రారంభించారు. శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన అమర్న నిరాహార దీక్షకు ఇండస్ట్రియల్ జోన్ బాధిత ఎనిమిది గ్రామాల రైతులు శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలుపుతున్నారు. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ లో ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్ రైతుల పంట పొలాల నుంచి ఎత్తి వేయాలని రైతు శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారూ. కామారెడ్డి పట్టణ పరిధిలోని దేవునిపల్లి, టేక్ రియల్, లింగాపూర్, ఇల్చిపూర్, అడ్లూరు ఎల్లారెడ్డి,అడ్లూరు, రమేశ్వర్ పల్లి, రాజంపేట గ్రామాల రైతులు మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా కామారెడ్డి, ఎల్లారెడ్డి ఎమ్మెల్యేలు స్పందించి రైతుల కు అండగా నిలిచి రైతుల పంట పొలాల నుంచి ఇండస్ట్రియల్ జోన్ జోన్లను ఎత్తివేసే దిశగా వారు కూడా తమకు ఎమ్మెల్యేలు అండగా ఉండాలని రైతులు కోరుకుంటున్నారు. 1195 ఎకరాలు రైతులు పంటలు పండించే భూములను మాస్టర్ ప్లాన్ లో చేర్చడం ఎత్తివేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే మరో దపా ఉద్యమాన్ని లేవనెత్తుతామని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన మాట ప్రకారం మాస్టర్ ప్లాన్ లో 8 గ్రామాల రైతుల పంట పొలాల భూములను తీసివేయాలని బాధిత రైతులు కోరుతున్నారు. యువరైతు శ్రీకాంత్ రెడ్డి చేపట్టిన అమరణ నిరాహార దీక్ష ఉద్యమం ఎటువైపు వెళుతుందో వేచి చూడాల్సిందే. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందిస్తారా లేక రైతులు రోడ్డు ఎక్కవలసి వస్తుందో వేచి చూడాల్సిందే. లేక ఆరోగ్యం క్షీణిస్తుందన్న సాకుతో భయభ్రాంతులకు గురిచేసి పోలీసుల సహాయంతో ప్రభుత్వం ఆమరణ నిరాహార దీక్షను భగ్నం చేస్తారో చూడాలి.

– మూడు రోజులైనా స్పందించని ఎమ్మెల్యేలు … రాజకీయ నాయకులు..
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాజకీయ నాయకులు ప్రజలు ఏ చిన్న ఉద్యమం చేసినా వారి దగ్గరికి వచ్చి మేమున్నామంటూ మద్దతు తెలిపే నాయకులు నేడు తమ భూములు పోతున్నాయి తాము ఆత్మహత్యలు చేసుకొనడమే శరణ్యం అంటూ రైతులు ఆవేదన చెందుతూ ఓ యువరైతు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి మూడవరోజు చేరుకున్న ఇప్పటివరకు ఏ రాజకీయ పార్టీ కానీ నాయకులు గాని స్పందించిన దాఖలాలు లేవు. ఇలాంటి నాయకులను ప్రజలు ఎన్నికల సమయంలో ఆదరిస్తూ వారికి ఓట్లు వేయడం వారిని నాయకులుగా చూడడం దురదృష్టకరం.